Minister Seethakka | ములుగు : విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే.. వికృత చర్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది టీచర్లు విద్యార్థినులను వేధిస్తుంటే.. ఇంకొందరేమో మద్యం సేవించి పాఠశాలకు వచ్చి హల్చల్ సృష్టిస్తున్నారు. ఇలాంటి టీచర్ల ఆగడాలను ప్రశ్నిస్తే.. దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.
రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో ఓ ఉపాధ్యాయుడు పీకల దాకా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం తాగి పాఠశాలకు రావడం ఎంత వరకు కరెక్ట్ అని ఓ వ్యక్తి.. ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు. టీచర్ ప్రవర్తనను తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుంటే.. నా స్కూల్లోకి వచ్చి నన్నే చిత్రీకరిస్తావా..? అంటూ నానా బూతులు తిట్టాడు. చివరకు ఆ వ్యక్తి ఫోన్‌ను టీచర్ నేలకేసి కొట్టాడు. ఈ ఘటన ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
ఇక మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల విద్యార్థులు నష్టపోతారని పేరెంట్స్ పేర్కొన్నారు. తమ పిల్లలను స్కూల్‌కి పంపించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
మంత్రి సీతక్క ఇలాకాలో మద్యం తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు
మద్యం తాగి వచ్చి పాఠశాలలో ఓ వ్యక్తిని బూతులు తిట్టిన ఉపాధ్యాయుడు
ములుగు – ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన pic.twitter.com/RwpLxgLyDz
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024
ఇవి కూడా చదవండి..
Gadwal | ఆ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ.. 18 కి.మీ. పాదయాత్ర చేసిన విద్యార్థులు
MLC Kavitha | 42 శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం : ఎమ్మెల్సీ కవిత
Harish Rao | కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు