ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 21:56:11

రేపటి కేటీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా..

రేపటి కేటీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. గోషామహాల్‌, సనత్‌నగర్‌, సికింద్రబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్డు షోల్లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గోషామహాల్‌ నియోజకవర్గంలోని జుమేరాత్‌ బజార్‌లో, 3 గంటలకు సనత్‌ నగర్‌ నియోజకవర్గంలోని పాటిగడ్డ చౌరస్తాలో, 4 గంటలకు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని శాంతినగర్‌ కాలనీ చౌరస్తాలో కేటీఆర్‌ రోడ్డు షోలు కొనసాగనున్నాయి. శనివారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ విజయవంతమైంది. సభకు అశేష జనం తరలివచ్చి టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.