Accident | నారాయణపేట : నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులు గాల్లో ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి పరిస్థితి విషమం. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/ae3uEFF0l0
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
ఇవి కూడా చదవండి..
KTR | ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్