జగిత్యాల : జగిత్యాల జిల్లాలో(Jagithyala Dist) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లి గోదావరి( Godavari) నదిలో ముగ్గురు యువకులు గల్లంతవగా(Youths drowned) ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి రాయపట్నం గోదావరి నది వంతెన వద్ద ముగ్గురు యువకులు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.
గమనించిన జాలర్లు, స్థానికులు ఇద్దరిని కాపాడారు. అందులో ఓ యువకుడు అపస్మారక స్థితికి వెళ్లగా వెంటనే జగిత్యాలలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, దుర్గా దీక్షలో ఉన్నవారు స్నానానికి వచ్చినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | 1908లో నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ కూలగొడుతున్నడు.. హరీశ్‌రావు ఫైర్
Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్మెంట్ మార్పు.. ఫోర్త్ సిటీ వరకు మెట్రో