హైదరాబాద్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వర్టు(Culvert) గుంతలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అవుటి నర్సింహులు(27), జిన్న మల్లేష్(24), జిన్న మహేష్(23) అనే ముగ్గురు యువకులు నారాయణపేట నుంచి నర్సాపూర్ వైపు బైక్పై వెళ్తున్నారు. కాగా, నిజాంపేట-బీదర్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న 160బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడి మృత్యువాత పడ్డారు.
ఇవి కూడా చదవండి..
Mahabubabad | తల్లి ఓటమిని తట్టుకోలేక.. కుమారుడి ఆత్మహత్య..మహబూబాబాద్ జిల్లాలో ఘటన
Journalists protest | ‘కార్డుల కుట్ర’పై కలం సైనికుల కదం..33 జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి