బయ్యారం, డిసెంబర్ 27 : సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తన తల్లి ఓటమి చెందడంతో తట్టుకోలేని తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకా రం.. చెరువుముందు కొత్తగూడెం గ్రామానికి చెందిన చింత వెంకటరమణ గతంలో సర్పంచ్‌గా ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా ఆమె పోటీచేసి ఓడిపోయింది. తల్లి ఓటమిని తట్టుకోలేకపోయిన తనయుడు చింత సునీల్ (25) ఈ నెల 15న పురుగులమందు తాగాడు. మహబుబాబాద్లోని ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.