Chevella Accident | తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే (Chevella Accident). ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొందరు తల్లిదండ్రులను కోల్పోగా.. మరికొందరు తమ పిల్లల్ని కోల్పోయారు. ఇక ఈ ఘటన ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు (Tandur) పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉండే ఎల్లయ్య గౌడ్‌కు ముగ్గురు కుమార్తెలు నందిని, సాయిప్రియ, తనూష ఉన్నారు. వారు హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవలే బంధువులు పెళ్లి ఉండటంతో సొంతూరికి వచ్చారు. వేడుకలను ముగించుకొని నగరానికి పయనమయ్యారు. ముగ్గురూ ఇవాళ ఉదయం బస్సులో బయల్దేరారు. ఎంతో సంతోషంగా ఉన్న వారిని మృత్యువు కబళించింది. పెళ్లివేడుకలో సందడిగా గడిపిన అక్కాచెల్లెళ్లు ముగ్గురూ ఇవాళ విగత జీవులుగా మారారు. బస్సు ప్రమాదంలో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలు మరణించడంతో తండ్రి ఎల్లయ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read..
Chevella Accident | మృతుల కుంటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన ప్రభుత్వం
Ponnam Prabhakar | చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: మంత్రి పొన్నం ప్రభాకర్
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన