హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించామన్నారు. మృతుల కుంటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన, మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. 72 మంది ప్రయాణికులతో బస్సు వస్తుండగా కంకర టిప్పర్ ఢీకొట్టిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సహాయం కోసం అధికారులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రమాద ఘటనలో 19 మంది చనిపోయినట్లు తెలిపారు.