Road Accident | డీసీఎం వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం గుర్రాల సోఫా కూడలి వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచినపల్లికి చెందిన వంశీ (19), నవీన్ (20) అనే ఇద్దరు యువకులు పని కోసం గజ్వేల్ జిల్లా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా చేగుంట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం వారిని ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వంశీ, నవీన్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ డీసీఎం డ్రైవర్ రాకేశ్‌ను గజ్వెల్ ఆసుపత్రికి తరలిస్తుంగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదం..