నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకొని పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే..మునుగోడు మండల కేంద్రంలో దొంగలు హడలెత్తించారు. వరుసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు. దుండగులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. మండల కేంద్రానికి చెందిన నాగరాజు స్వీట్ హౌస్‌లో రూ.70,000 నగదు, వారి ఇంట్లోనే 12 తులాల బంగారాన్ని(Gold) ఎత్తుకెళ్లారు,
వడ్డెర గూడెంకు చెందిన ముద్దంగుల నర్సింహా ఇంట్లో రెండు లక్షల యాబై వేల నగదు అపహరించినట్లు సమాచారం. ఇదే గ్రామానికి చెందిన రాసమల్ల శ్రీరాములుకు చెందిన బైక్ అపహారణకు గురైంది. మునుగోడు లోని వెనిగల పురుషోత్తమ్ ఇంట్లో రూ.60,000 నగదు, అరకిలో వెండి ఎత్తుకెళ్లారు. ఫారెస్ట్ ఆఫీస్‌లో సైతం దొంగతనం జరుగడం విశేషం. కాగా, వరుస దొంగతనాలతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతు న్నారు. నిందితులను త్వరగా పట్టుకొని రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్