బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:55

గోపాలమిత్రలకు సర్కారు అండ

గోపాలమిత్రలకు సర్కారు అండ

  • పశుసంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌
  • వేతనాల విడుదలపై గోపాలమిత్రల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీవాలకు వైద్యసేవలు అందిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టంచేశారు. వేతనాలు విడుదలచేసిన సందర్భంగా గోపాలమిత్రలు శుక్రవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మంత్రి తలసానిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతోకాలంగా సేవలందిస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్‌ చొరవతో రూ.3,500గా ఉన్న వేతనాన్ని రూ.8,500కు పెంచి గుర్తింపు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, గోపాలమిత్రలు శ్రీనివాస్‌, శ్రీరాములు, శంభులింగం, రాజు, వెంకట్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.logo