మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 11:57:55

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

హైద‌రాబాద్: ఆప‌ద‌లో ఉన్న వారికి తక్షణ స‌హాయంగా అందిస్తున్న ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నిరుపేద‌ల పాలిట ఆప‌ద్బంధు అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఒక‌వైపు ఆరోగ్య శ్రీ ఉన్నప్పటికీ తక్షణ వైద్య స‌హాయానికి సీఎంఆర్ఎఫ్ ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. పలువురు బాధితులకు మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్వోసీలను అందజేశారు.

హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో ముగ్గురికి, మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన బేబీ శ్రీలతకు రూ.2లక్షలు, జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతులకు చెందిన సయ్యద్ గౌసియా బేగానికి రూ.లక్ష, తొర్రూరు మండలం గుడిబండ తండాకు చెందిన బి. రవికి రూ.లక్ష ఎల్వోసీలను మంత్రి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


logo