Jaya Prakash Narayana | ఇప్పుడున్న ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు ఏకంగా ఎనిమిది జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారుల మీదుగా వెళతాయి. విజయవాడ హైవే (ఎన్‌హెచ్-65)పై పెద్ద అంబర్‌పేట, ముంబై హైవే (ఎన్‌హెచ్-65)పై ఇస్నాపూర్, బెంగళూరు హైవే (ఎన్‌హెచ్-44) శంషాబాద్, నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ, వరంగల్ హైవే (ఎన్‌హెచ్-163)పై ఘట్కేసర్, శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్-765)పై తుక్కుగూడ, నర్సాపూర్ హైవే (ఎన్‌హెచ్-765డీ)పై దుండిగల్, బీజాపూర్ హైవే (ఎన్‌హెచ్-163)పై టీఎస్ పోలీస్ అకాడమీ వద్ద కలుస్తున్నాయి.
దీంతో పాటు రాజీవ్ రహదారిపై తూంకుంట-శామీర్‌పేట, నాగార్జునసాగర్ రహదారిపై బొంగుళూరు వద్ద మెట్రో కలుస్తుంది. తెలంగాణలోని ఏ మూల నుంచి నగరానికి రావాలన్నా వీటి మీదుగానే రావాలి. అవసరమైన వారు ఓఆర్ఆర్ దాకా వచ్చి మెట్రోలో నిమిషాల వ్యవధిలోనే నగరంలోని గమ్యానికి సులువుగా వెళతాడు.
నాయకుడు అంటే మూడు తరాల భవిష్యత్తు ఆలోచించాలంటరు. అందుకే సీఎం కేసీఆర్ రానున్న మూడు తరాల హైదరాబాద్‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో విస్తరణ చేపట్టారు. కానీ జయప్రకాశ్ నారాయణ మెట్రో విస్తరణ తెల్ల ఏనుగు అన్నపుడే ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని తేటతెల్లమైంది. హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ ప్రాజెక్టు..ఈ మూడు అంశాలను సమగ్రంగా పరిశీలిస్తే నగర భావి ముఖచిత్రం కనిపిస్తుంది. కానీ ప్రధాన నగరం మీదుగా వెళ్లాలంటే ఇటు నగర ట్రాఫిక్పైనా ప్రభావం ఉంటుంది. ఘట్కేసర్, మేడ్చల్ గౌడవెల్లి, ఈదుల నాగులపల్లి, శంషాబాద్ వంటి చోట్ల రైల్వే లైన్లు కూడా కలుస్తున్నందున రైల్వే టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే అందరూ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు రావాల్సిన అవసరం ఉండదు. వీటన్నింటికీ మించి ప్రధాన నగరంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేక మథనపడుతున్న లక్షలాది కుటుంబాలు ఓఆర్ఆర్ దాకా వెళ్లి ఆ కలను సాకారం చేసుకుంటాయి. టౌన్‌షిప్‌లు ఏర్పాటవుతాయి. మెట్రోలో నిమిషాల వ్యవధిలో నగరానికి చేరుకుంటారు. ‘మెట్రో ఆఫ్ ప్యారిస్’ను పరిశీలిస్తే బహుముఖ ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అక్కడ సామాన్యుడి నుంచి దేశ ప్రధాని వరకు ఎవరైనా తమ సొంతవాహనాలను మెట్రో స్టేషన్లలోనే పార్క్ చేసి మెట్రోలో వెళ్లాల్సిందే. హైదరాబాద్‌ను కూడా అలా చేయాలనేదే కేసీఆర్ వ్యూహం. ఇది కదా ఒక నాయకుడి దూరదృష్టి, విశ్లేషణ సాగాల్సిన కోణం? కానీ, జేపీ మనసు, మెదడు అందుకు భిన్నం. అందుకే ఒక్క టర్మ్‌తోనే ప్రజలు సెలవు మంజూరుచేయటంతో చివరకు పార్టీ దుకాణాన్ని కూడా మూయించారు.
Jaya Prakash Narayana | హైదరాబాద్ మెట్రోపై జేపీ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమిదే!