Jaya Prakash Narayana | వ్యవసాయానికి నీళ్లందితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా విలువలే లెక్కించాల్సి వస్తే గత ఒక్క ఏడాదే రాష్ట్రంలోని వివిధ బ్యారేజీల్లో ఉత్పత్తి అయిన మత్స్య సంపద విలువ రూ.6,600 కోట్లు. అందులో సింహభాగం కాళేశ్వరం బారేజీల్లో, అది నింపిన చెరువుల్లోదే! వ్యవసాయానికి నీరు అందితే ఆ ప్రయోజనం రైతుకు మాత్రమే కాదు, రైతుకూలీలకు ఉపాధి రూపంలో ప్రయోజనం చేకూరుతుంది. రైతు ఆదాయం పెరిగితే అది పొదుపు పెట్టుబడుల రూపంలో ప్రభావం చూపుతుంది. ఆ ధాన్యం మార్కెట్లకు మిల్లులకు అంతిమంగా వినియోగదారులకు చేరే క్రమంలో జరిగే లావాదేవీలన్నీ ఎక్కడికక్కడ ఆదాయాలను, లాభాలను, సంపదను సృష్టిస్తూనే ఉంటాయి.
తొర్రి మెచ్చేది ఉప్పుడు పిండి’ అని సామెత. పాపం పండ్లు లేవు. నమల్లేదు. గట్టిపదార్థాలు తినడం సాధ్యపడదు. ఏం చేస్తుంది! ఉప్పుడు పిండి అయితే నోట్లో వేసుకొంటే కరిగిపోతుంది. అందుకే అదంటే ఇష్టం. పచ్చలాబీ పరిస్థితీ అలాగే ఉన్నది. వాళ్లకు చేసుకోవడం రాదు. చేసుకోలేరు. తమ లాగే అంతా ఉండాలనుకుంటారు.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విషయంలో పచ్చలాబీ గింజుకుచచ్చే అంశం కాళేశ్వరం. మామూలుగా దశాబ్దాలు దాటినా చిన్నచిన్న ప్రాజెక్టులే ముందుకు పడని అనుభవం సమైక్యపాలకులది. ‘మాతోనే కాలేదు. అలాంటిది వీళ్లతో ఏమవుతుంది?’ అనుకున్న ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కేవలం మూడున్నరేండ్లలో పూర్తి చేయడం.. అంతర్ జాతీయ మీడియా దానిని ‘ఒక నదిని తరలించడం’గా అభివర్ణించడం, జలసంఘం చైర్మన్లు, నిపుణులు దాన్ని, దాని సాంకేతికశైలిని కీర్తించడం అస్సలు మింగుడుపడటం లేదు. ఆ ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటినుంచి వరుస దాడులకు పచ్చ మీడియా వేదికైంది. నెత్తి మీద రూపాయి పెడితే పావలా విలువ చేయని వాళ్లను టీవీ చర్చల్లో కూర్చోబెట్టి ప్రాజెక్టు మీద ఎన్నో అపోహలను సృష్టించే ప్రయత్నం చేసింది. తెలంగాణను ఎలాగైతే విఫల రాష్ట్రంగా చూపాలని యత్నించిందో అదే దారిలో కాళేశ్వరం కూడా విఫల ప్రాజెక్టు అనిపించాలని యథాశక్తి ప్రయత్నం చేసింది. ఈ భావజాలాన్ని మేధో ముఖంతో ముందుకు తీసుకువెళ్లిన వారు సర్వశ్రీ స్వయం ప్రకటిత మేధావి జయప్రకాశ్గారు. కాళేశ్వరం విషయంలో ఆయన తన అక్కసు ఏమాత్రం దాచుకోలేదు. సింపుల్‌గా ‘కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు. భవిష్యత్తులో తెలంగాణకు ఇది గుదిబండ అవుతుంది’ అనేశారు. ఇందులో సగం ఖర్చుతో ఇంతకన్నా గొప్పగా నీరు అందించవచ్చన్నారు. తన బ్యూరోక్రటిక్ ఆలోచనలకు పదును పెట్టి ప్రాజెక్టు మీద పెట్టే ఖర్చుకు రెట్టింపు లాభాలు రావాలన్నారు. అంతటితో ఆగకుండా అది కేసీఆర్ డబ్బు కాదు. మా డబ్బు. పన్నుల డబ్బు. అప్పులు తెచ్చి మా పిల్లల భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారు.. అనేదాకా వెళ్లారు. ‘మెట్రో కూడా మరో కాళేశ్వరం అవుతుంది’ అంటూ ఈ సందర్భాన్ని కూడా తెలంగాణ వరదాయినిపై బురద చల్లేందుకు వాడుకున్నారు.
ఇన్నాళ్లూ తెలంగాణ ఏం కోల్పోయిందో అవన్నీ అందించే యజ్ఞం కేసీఆర్ పాలన. ఉరితాళ్లలో వేలాడిన రైతుల వేదనలు విన్న అనుభవం, ఆ దైన్యాన్ని చూసిన అనుభవం, దానికి కారణాలు తెలిసిన అనుభవం ఆయనను మరో భగీరథుడిగా మార్చాయి. చుట్టూ పారే గోదావరి, కష్ణలను తెలంగాణ గడ్డ మీదికి తెచ్చుకోలేకపోతే తెలంగాణకు అర్థమే లేదనేది ఆయన సంకల్పం. తెలంగాణ సకల దరిద్రాలకు ఒకే విరుగుడు.. అది నీళ్లు! ఓ పదేండ్లు ఆ నీటిని అందించగలిగితే తెలంగాణ దేశాన్ని ఏలుతుంది.. శాసిస్తుంది. బహుశా జేపీలాంటి వారి బాధా అదేనేమో!
బుర్రలేని మేధావితనం
తెలంగాణ అంటే జేపీకి ఏం అర్థమైంది? ఈ తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరుపుతున్నపుడు ఏం కోరుకున్నది? సమైక్య రాష్ట్రంలో ఏం కోల్పోయిందని ఉద్యమం ప్రారంభించింది? రాష్ట్రం వచ్చాక ఏం చేసుకోవాలనుకొంటున్నది? అనే ఆలోచన లేదు. తన ముసుగు తీసి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు. ఎంత ఖర్చు? ఎంత రాబడి? అంటూ లెక్కలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. కాళేశ్వరం వాడే విద్యుత్తు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు అంతా కలిపితే ఎకరానికి రూ.50 వేలు అని మైకులు బద్దలు కొడుతున్నాడు. ఇంతకన్నా బోరు వేస్తే రూ.5 వేల ఖర్చుతో నీరు అందుతుందట. అవునా?! 70 ఏండ్లుగా ఇలాంటి ఐఏఎస్‌లు పాలన సాగించారు కాబట్టే దేశం ఇలా తగలబడింది. తాము పనిచేస్తున్నది రాళ్లకు రప్పలకు కాదు.. ప్రాణమున్న మనుషులకు అనే జ్ఞానం లేదు. కింద నీళ్లుండి అందితే కదా బోర్లు పనిచేసేది! బోరేస్తేనే నీరు వచ్చేటట్టయితే నల్లగొండ జిల్లాలో డజన్లకొద్దీ బోర్లు వేసిన బోర్ల రాంరెడ్లు ఎందుకు తయారయ్యారు? నిజామాబాద్ జిల్లాలో బోర్ ఫెయిల్ అంటే ఇంట్లో సావు చేసినంత దైన్యం ఎందుకు కనిపిస్తున్నది? ఆ కుటుంబాలు ఆర్థికంగా అథఃపాతాళానికి ఎందుకు కుంగిపోతున్నాయి? ఎన్నడన్నా ఆలోచించి ఉంటాడా? ఒక వ్యవసాయ దేశమై ఉండీ ఏటా రూ.లక్షకోట్ల ఫామాయిల్ దిగుమతి చేసుకొంటున్నాం. మనం తినే కందిపప్పును విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం.
ఎందుకు? ఇదిగో..70 ఏండ్లుగా ఇలాంటి లెక్కల తిక్క మాస్టార్లు ఏలారు కాబట్టే. రైతులు పురుగుల మందులో తమ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటున్నారంటే ఇలాంటి అవివేక, అసమర్థ అధికారుల వల్లే. పప్పులు పండించే రైతుకు మంచి ప్రోత్సాహకాలే ఇస్తే ఇలా దిగుమతులు చేసుకొనే అవసరమే రాదు. వీళ్లకు ఇవేవీ పట్టవు. పైగా కాళేశ్వరం మీద ప్రభుత్వం పెడుతున్నదంతా మా డబ్బు. ప్రజల డబ్బు. ఎవడబ్బ సొమ్మని పెడతారు అనే డైలాగులు. అసలు ఇలాంటి వాళ్లకు మిస్సోరీలోని పచ్చటి పర్యావరణంలో కాదు. విదర్భలో చినుకు రాలని, సాగు సాగని, నీటి వసతిలేని మారుమూల గ్రామాల్లో ఉంచి రోజుకు నాలుగైదు గంటలు భూమి దున్నించాలి. అపుడే కరెంటు అంటే ఏమిటో.. నీటి విలువ ఏమిటో.. ఈ దేశ రైతు బతుకు చిత్రం ఏమిటో అర్థమవుతుంది. కారు ఆగగానే సెల్యూట్ కొట్టి డోర్ తీసే బంట్రోతులు.. ఏదీ అడగక ముందే అన్నీ అమర్చే సబార్డినేట్లు, చేతులు జోడించి తమ కష్టాలు చెప్పుకొనే సామాన్యప్రజల మధ్య రాజ దర్భారులు నడిపే ఇలాంటి అధికారులకు అదే కరెక్టు.
సాగునీటి ప్రాజెక్టు లక్ష్యమేమిటో తెలుసా?
వీళ్లకు కాళేశ్వరం అంటే అక్కడ నీరు ఎత్తడానికి వాడే పంపుల కరెంటు బిల్లులు, నీరు వెళ్లి చేలో పడితే పండే పంటల దిగుబడి మీద వచ్చే రాబడి.. అంతే. మరి కాళేశ్వరం అంటే అంతేనా? ఒక ప్రాజెక్టు తెచ్చే నీటి ప్రభావం కేవలం కొన్ని ఎకరాల్లో పండే పంటలకే పరిమితమా? మనదేశంలో గ్రామీణ సమాజానికి నీరే ఆర్థిక ఇంజిన్. వ్యవసాయమే లైఫ్‌లైన్. ఈ నీటి విలువను కొలవాల్సింది నీరు, ఎకరాలు, పంట నిష్పత్తి లెక్కల్లోనే కాదు. నీటి వల్ల వ్యవసాయంతో పాటు, వ్యవసాయ అనుబంధ వృత్తులపై పడే ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలూ లెక్కగట్టాలి. చెరువుల్లో నీరు చేరినపుడు ఆ చెరువులో పెరిగే మత్స్య సంపద విలువనూ లెక్కగట్టాలి. పాడి పశువులకు దొరికే పశుగ్రాసం, వాటికి తాగునీరు విలువనూ లెక్కగట్టాలి. ఇదే రాష్ట్రంలో ఎండాకాలం పశుగ్రాసం దొరక్క రైతులు పడ్డ ఇబ్బందులనూ గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక రాష్ట్రంలో సింహభాగం మిషన్ భగీరథకు కాళేశ్వరం ప్రాజెక్టే ఇన్‌టేక్ పాయింట్. 10 శాతం నీటిని తాగునీటికి కేటాయించారు. అక్కడి నుంచి ఇంటింటికీ శుద్ధి చేసి అందిస్తున్న తాగునీటికి ఏం విలువ కడతారు? భగీరథ నీరు వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాలు మెరుగయ్యాయి. వాటికి ఏం విలువ కడతారు? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పరిశ్రమలకూ నీటి కేటాయింపు ఉన్నది.
పుష్కలంగా నీరు లభించినందువల్ల మరోవైపు 24 గంటల విద్యుత్తు వల్ల రాజధాని నగరంలో మూడు షిప్టుల్లో పనిచేస్తున్న ఆ పరిశ్రమల ఉత్పత్తుల్లో ఈ నీటి వాటాకు ఏం విలువ కడతారు? అందులో కల్పించే ఉపాధికి, వాటివల్ల ఆ కుటుంబాలకు జీతాల రూపంలో సమకూరే ఆర్థిక చేయూతకు ఏం విలువ కడతారు? అలాగే ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రమూ దీనిమీదే ఆధారపడ్డది. దానికేం విలువ కడతారు? హైదరాబాద్‌లో తాగునీటి పరిస్థితి 7 ఏండ్ల క్రితం ఎట్లుంది? ఇప్పుడెట్లుంది? రాష్ట్ర జనాభాలో మూడోవంతు నివసించే హైదరాబాద్ నగరానికి ఇదే కాళేశ్వరం నీళ్లే వస్తున్నాయి. ఒక మహానగరానికి దాహం అనేది తెలియకుండా చేస్తున్న వ్యవస్థకు ఏం విలువ కడతారు? ఆ కారణంగా నగరానికి వస్తున్న పరిశ్రమలు.. అవి కల్పించే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి ఏం విలువ కడతారు? విలువలే లెక్కించాల్సి వస్తే గత ఒక్క ఏడాదే రాష్ట్రంలోని వివిధ బ్యారేజీల్లో ఉత్పత్తి అయిన మత్స్య సంపద విలువ రూ.6,600 కోట్లు. అందులో సింహభాగం కాళేశ్వరం బారేజీల్లో, అది నింపిన చెరువుల్లోదే! వ్యవసాయానికి నీరు అందితే ఆ ప్రయోజనం రైతుకు మాత్రమే కాదు, రైతుకూలీలకు ఉపాధి రూపంలో ప్రయోజనం చేకూరుతుంది. రైతు ఆదాయం పెరిగితే అది పొదుపు పెట్టుబడుల రూపంలో ప్రభావం చూపుతుంది. ఆ ధాన్యం మార్కెట్లకు మిల్లులకు అంతిమంగా వినియోగదారులకు చేరే క్రమంలో జరిగే లావాదేవీలన్నీ ఎక్కడికక్కడ ఆదాయాలను, లాభాలను, సంపదను సృష్టిస్తూనే ఉంటాయి.
ఎంతకాలమీ పిండాకూళ్ల రాజకీయం?
రాష్ట్రం వచ్చేనాటికి తెలంగాణలో రైతులు తమ సొంత డబ్బుతో 20 లక్షలకు పైగా బోర్లు వేసుకున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. రైతు ఆత్మహత్యలకు బోర్ల వైఫల్యం కూడా ఓ కారణమే. నాటి సమైక్య పాలకులు రైతు ఆత్మహత్యల మీద వేసిన జయతిఘోష్ కమిటీ కూడా సాగునీటి లభ్యత లేకపోవడమే రైతుల అప్పులకు, ఆత్మహత్యలకు కారణమని తేల్చి చెప్పింది. చంద్రబాబు హయాంలో బీటీ పత్తి విత్తనాల వైఫల్యంతో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత వేలాది చావుకేకలు తెలంగాణ వచ్చేదాక దేశమంతా ప్రతిధ్వనించాయి. ఎందరో సొల్లుగాళ్లు ఆ రైతుల ఇండ్లలో పిండాకూళ్లు తిని మైకులు బద్దలయ్యేదాకా సమగ్ర వ్యవసాయ విధానాలు అంటూ నినాదాలిచ్చారు. అదే పిండాకూళ్ల రాజకీయం ఇంకాఇంకా కొనసాగాలా? కాళేశ్వరం వద్దు.. మరి 600 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు ఎక్కేది ఎలా? పంపులు లేకుండా, కరెంటు కాలకుండా నీళ్లు పంట చేలకు ఎలా వస్తాయి? ఈ వాన కాలంలో మొదట్లో వర్షాలు లేవు. ఏ ఒక్క సోల్లుగాడు వచ్చి వాళ్లు చెప్పే పద్ధతిలో నీరు అందించలేదే? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క చుక్క నీటిని సృష్టించలేం. మళ్లీ కాళేశ్వరమే గతి. ఇపుడు ఆ కాళేశ్వరం నీళ్లే వరదకాల్వ నుంచి ఎదురెక్కుతూ కాల్వ పొడవునా వందల చెరువులను నింపుతున్నాయి. ఆ కాళేశ్వరం నీళ్లే రేపు శ్రీరాంసాగర్ కాకతీయ, సరస్వతి కాల్వల్లో ప్రవహించనున్నాయి. మిడ్ మానేరును ఎల్ఎండీని దాటుకొని నల్లగొండ జిల్లాదాకా ప్రవహించనున్నాయి. ఇంకాఇంకా అహంకారపు ప్రదర్శనలు మానండి. వ్యాపారిలా కాదు, చేతనం ఉన్న మనిషిలా ఆలోచించండి కాళేశ్వరం ఏమిటో అర్థమవుతుంది. చదువుకున్నామనే అహంకారం వదిలేసి పంటపొలాల్లో బురద మట్టిలో నడిచి పరిస్థితి చూడండి. అక్కడ రైతు సద్దిమూటలో ఓ ముద్ద తినండి. నీరంటే ఏమిటో.. ఆ నీటికోసం తండ్లాడే కండ్లల్లో ఉప్పొంగే కన్నీటికి బంధం ఏమిటో అర్థమవుతుంది.
ప్రజా ప్రయోజనం గిట్టుబాట్ల బేరం కాదు
‘ఎప్పుడు ఎడతెగక పారుతున్న ఏరున్, ద్విజుడున్’ అంటూ మన పెద్దలు హితవాక్యం చెప్పారు. ఆ మాటల వెనుక ఎంతటి అర్థం ఉన్నది! ఎంతటి అనుభవం ఉన్నది! కాళేశ్వర వ్యతిరేక బ్యాండ్‌కు తెలుసో లేదో.. ఈ పెద్దల వాక్యాన్ని ఈ గడ్డను ఏలిన రాజరాజన్యులంతా శిరసావహించారు. సాగునీరు అందించడం తమ కర్తవ్యంగా స్వీకరించారు. కాకతీయుల నుంచి కుతుబ్‌షాహీల వరకు అందరికందరు వందలకొద్దీ తటాకాలు తవ్వించారు. వారెన్నడూ ఖర్చులూ, గిట్టుబాట్లు అని చూడలేదు. దేవుడి దయ వల్ల అప్పుడు ఈ జేపీలు లేరు! అలా చూసే ఉంటే పాకాల, లక్నవరం వంటి భారీ తటాకాలు ఉండేవే కావు. వాటిని పాలనలో బాధ్యతగా స్వీకరించారే తప్ప లాభాలు చూసుకోలేదు. అంతేకాదు తమ కాలంలో దానం, ధర్మం అనే పుణ్యకార్యాల్లో ఆలయ నిర్మాణం లాగానే తటాక నిర్మాణం, కూప నిర్మాణం కూడా పుణ్యకార్యంగా భావించినట్టు ఆయా తటాకాల వద్ద వారు వేయించిన శాసనాలు చెప్తున్నాయి. ఈ దేశ ఆధ్యాత్మిక విలువలను అవి మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. కుతుబ్‌షాహీలు ఈ దేశ ఆధ్మాత్మిక విలువలను పాటించి అనేక తటాకాలు నిర్మించారు. నిజాం రాజులు హైదరాబాద్ వరదలను అరికట్టేందుకే హిమాయత్ సాగర్‌ను నిర్మించారు. ఇందులో లాభనష్టాలు, గిట్టుబాట్లు లేవు. నిజాంసాగర్ ఆనాడు ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు. భారీ వ్యయం చేశారు. దాంట్లో నిజాములు గిట్టుబాట్లు చూశారా? రాచకొండ రాజులు అనేక తటాకాలను సముద్రాల పేరుతో నిర్మించారు.
అంతెందుకు గోదావరి మీద కాటన్ దొర ఆనకట్ట కట్టినపుడు విదేశీయుడైనా కూడా గిట్టుబాటు లెక్కలు వేసుకోలేదు. గోదావరి వరదల నివారణ. పంటలకు నీళ్లు అందించడం మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. నీటితోనే నాగరికత. నీటితోనే అభివృద్ధి. నీరు ఉంది కాబట్టే కోస్తాంధ్ర జిల్లాలు సుసంపన్న ప్రాంతంగా మారాయి. అక్కడి మిగులు డబ్బు అనేక రంగాల్లో పెట్టుబడులుగా మారింది. ఆ డబ్బే నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర రాజకీయాలను శాసించింది. తెలంగాణ అదే నీరు లేక అల్లాడింది. పేదరికంలో మగ్గింది. ఊళ్లో భూములున్న రైతులు కూడా హైదరాబాద్‌లో రిక్షాలు లాగి బతికారు. ముంబై బస్సులెక్కారు. గల్ఫ్ విమానాలూ ఎక్కారు. కానీ కాలం ఒకేలా ఉండదు. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం. ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రం. రాష్ర్టాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలిసిన నాయకుడు కేసీఆర్. ఇన్నాళ్లూ తెలంగాణ ఏం కోల్పోయిందో అవన్నీ అందించే యజ్ఞం ఆయన పాలన. ఉరితాళ్లలో వేలాడిన రైతుల వేదనలు విన్న అనుభవం, ఆ దైన్యాన్ని చూసిన అనుభవం, దానికి కారణాలు తెలిసిన అనుభవం ఆయనను మరో భగీరథుడిగా మార్చాయి. చుట్టూ పారే గోదావరి, కృష్ణలను తెలంగాణ గడ్డ మీదికి తెచ్చుకోలేకపోతే తెలంగాణకు అర్థమే లేదనేది ఆయన సంకల్పం. తెలంగాణ సకల దరిద్రాలకు ఒకే విరుగుడు.. అది నీళ్లు! ఓ పదేండ్లు ఆ నీటిని అందించగలిగితే తెలంగాణ దేశాన్ని ఏలుతుంది.. శాసిస్తుంది. బహుశా జేపీలాంటి వారి బాధా అదేనేమో!
హైదరాబాద్ మీద ఏడుపు..
ఆఖరుగా అసలు విషయం ఆయన నోట్లోంచి ఆణిముత్యమై జాలువారింది. ‘అనేక రాష్ర్టాలకు మహానగరాలున్నాయి. తమిళనాడుకు చెన్నై, మహారాష్ట్రకు ముంబై ఉన్నాయి. అవి పెద్ద రాష్ర్టాలు. కానీ తెలంగాణ చిన్న రాష్ట్రం. ఇక్కడ హైదరాబాద్ అనే మహానగరం ఉన్నది కాబట్టి మీకు అదృష్టం కలిసింది. ఒకప్పుడు హైదరాబాద్ మిగులు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలు పంచుకొనేవి. ఇపుడు హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే చెందుతున్నది. మంది తక్కువయ్యారు.. మజ్జిగ చిక్కనైంది. అందువల్ల ఆదాయం ఉన్నది. అందుకని రాజుల్లాగా, నిజాము లాగా బుద్ధికి వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారా?’ అంటున్నారు. సరే.. ఖర్చు సంగతి అలా పెడితే హైదరాబాద్ దాని ఆదాయం మీద ఆయన మనసులో ఉన్న బాధ బయట పడింది.
బీజేపీ ఏం చేసినా ఓకే..
తెలంగాణకు అప్పులు, ఖర్చు, లాభాలు అని లెక్కలు చెప్పిన జేపీ.. కేంద్రం చేస్తున్న అప్పుల మీద మాత్రం ప్రపంచ పరిస్థితులు అని సన్నాయి నొక్కులు నొక్కారు. తెలంగాణ అప్పుల గురించి చెప్తున్నారుగదా? మరి కేంద్రం భారీ స్థాయిలో చేసిన అప్పుల మాటేమిటి? అంటే గత మూడేండ్లుగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, కాబట్టి ప్రతి దేశం ఎంతో కొంత అప్పులు చేయాల్సి వస్తున్నదని వత్తాసు పలికారు. కరోనా టైంలో వ్యాపారాలు లేక ఆదాయాలు పడిపోయాయని, కొవిడ్‌ను ఎదుర్కోవడానికి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి డబ్బులు అవసరం కదా? అని సమర్థించుకొచ్చారు. మరి తెలంగాణకు కొవిడ్ ప్రభావం పడలేదా? ఇక్కడ వ్యాపారాలు, ప్రభుత్వ ఆదాయం పడిపోలేదా?
దళిత బంధు కూడా నచ్చలే
జేపీకి కాళేశ్వరమే కాదు.. మిషన్ భగీరథ, దళితబంధు కూడా నచ్చలే. దళితబంధు పథకాన్ని ఆలోచన లేకుండా చేపట్టారని అన్నారు. ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా ఎక్కడా ఇంతపెద్ద మొత్తంలో ఇచ్చే పథకం లేదన్నారు. సంపన్న దేశం అమెరికా కరోనా సమయంలో ఇచ్చిన 2 వేల డాలర్లే ఇప్పటిదాకా అత్యధికమని ఉదహరించారు. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి పవిత్రమైన ప్రజల డబ్బును రాజుల్లాగా, నిజాముల్లాగా ఇచ్చేయడం ప్రజాస్వామ్యం కాదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా అడ్డగోలుగా పెంచారని, సంఘటిత రంగమని వాటేసుకుంటామా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఆకలి చావులు ఉండరాదని తాత్కాలికంగా ఇచ్చిన భృతిని ఈయన దళితబంధు పథకంతో పోల్చుతున్నారు. దళితబంధు అనేది సామాజిక వివక్షను రూపు మాపి ఒక కుటుంబాన్ని సమగ్రంగా ఆదుకొని నిలబెట్టడానికి ఉద్దేశించింది. ఇంతకాలం అనేక ప్రభుత్వాలు పిప్పరమెంట్లు, చాక్లెట్లు ఇచ్చినట్టు ఇపుడూ అలాగే ఇవ్వాలని కోరుతున్నారా? 10 లక్షలు పెద్ద మొత్తం కావచ్చు.. కానీ ఒక దళిత కుటుంబానికి పూర్తిస్థాయి ఉపాధి కల్పించి సమాజంలో గట్టిగా నిలబెడుతుంది. అర లక్ష, లక్షా వంటి పథకాలు గతంలో ఏం ఉద్ధరించాయో, ఎందరు దళితులు ఎంతవరకు నిలబడ్డారో మనందరికీ తెలుసు.
కరెంటు 2 వేల మెగావాట్లు దాటదు
తెలంగాణ జలవనరుల నిపుణుడు వీ ప్రకాశ్ విశ్లేషణ ప్రకారం తెలంగాణకు సంబంధించినంత వరకు ప్రతి ఐదేండ్లలో రెండేండ్లు భారీవర్షాలు పడతాయి. రెండేండ్లు డెఫిసిట్‌తో కరువు ఉంటుంది. ఇంకో సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పలేం. భారీ వర్షాలు పడితే ఫర్వాలేదు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా లింక్ వన్‌లోని పంపులు ఆన్ చేయరు. మరి ఆ సందర్భంలో జేపీ సవాలు చేసిన 6,100 మెగావాట్ల కరెంటు ఖర్చు లెక్కల మాటేమిటి? పైనుంచి గోదావరి వరద ఎల్లంపల్లికి చేరుకుంటే ప్యాకేజీ 6, ప్యాకేజీ 8, మేడారం, రామడుగు దగ్గర లిప్ట్ అవసరమవుతుంది. వర్షాల స్థాయిని బట్టి మిగిలిన పంపుల వాడకం ఉంటుంది. మామూలు వర్షాలు కురిసి రిజర్వాయర్లలో ఓ మోస్తరు నీరు వస్తే.. అపుడు మిగిలిన సప్లిమెంట్ నీటికోసం అవసరాన్ని బట్టి రెండుమూడు నెలలు ఎత్తిపోస్తారు. దానికి వెయ్యి నుంచి 2వేల మెగావాట్ల కరెంటు దాటదు. 3 టీఎంసీలు ఎత్తిపోసే ఏర్పాటు చేసుకొన్నామంటే ఏటా 200 రోజులు 3 టీఎంసీలు ఎత్తిపోస్తామని కాదు. పైనుంచి గోదావరి నీరు రాకపోతే అవసరాన్ని బట్టి వాడుకొంటామని. మన సాధారణ వర్షపాతం 930 మిల్లీమీటర్లు.
దశాబ్దాల అనుభవాన్ని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సగటు విద్యుత్తు వినియోగం జేపీ చెప్పిన లెక్కల్లో నాలుగో వంతు కూడా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 15 రిజర్వాయర్ల కెపాసిటీ 145 టీఎంసీలు ఏర్పాటు చేసుకొన్నామంటే ఒక్కసారి వాటిని నింపుకుంటే.. కరువు వచ్చిన సందర్భంలో వాటినుంచి నీటిని విడుదల చేసి రైతులకు ఆదుకోవచ్చుననే ముందుజాగ్రత్త. కాళేశ్వరం పరిధిలో 14 లక్షలకు పైగా బోర్లు ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు వస్తే బోర్లు ఆన్ చేసే అవసరమే రాదు. ప్రస్తుతం రైతులకు ఉచిత విద్యుత్తు కింద సుమారు 10 వేల కోట్ల సబ్సిడీని ప్రభుత్వం విద్యుత్తు సంస్థకు చెల్లిస్తున్నది. ఆ డబ్బును కాళేశ్వరం విద్యుత్తు చార్జీలకు మళ్లించవచ్చు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో రాత్రి పీక్ అవర్స్ తర్వాత నుంచి తెల్లవారు 4 గంటల దాకా జరిగే విద్యుదుత్పత్తి వృథాగా పోతున్నది. ఆ సమయంలో పంపులు వాడుకుంటే ఆ మేరకు డబ్బు ఆదా అవుతుంది. దానికితోడు వర్షాలు బాగా సహకరిస్తే అపుడూ డబ్బు ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్తు ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్నవాటిని, సెంట్రల్ గ్రిడ్‌నుంచి తీసుకొనే కరెంటును కలుపుకొంటే మనకు దాదాపు 27,500 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అత్యధిక పీక్అవర్ డిమాండ్ 9 నుంచి 10 వేల మెగావాట్లు. అంటే ఇంకా 17,500 మెగావాట్లు మిగులు ఉంటుంది. సేఫ్‌సైడ్‌గా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందం ఉన్నది. దీంతో కాళేశ్వరానికి విద్యుత్తు సమస్య ఏర్పడే అవకాశమే లేదు.
దేశాన్ని తెలంగాణ ఏలుతుందనేదే జేపీ బాధ!
తెలంగాణ ఉద్యమం చేసి తెచ్చుకున్న రాష్ట్రం. రాష్ర్టాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలిసిన నాయకుడు కేసీఆర్. ఇన్నాళ్లూ తెలంగాణ ఏం కోల్పోయిందో అవన్నీ అందించే యజ్ఞం ఆయన పాలన. ఉరితాళ్లలో వేలాడిన రైతుల వేదనలు విన్న అనుభవం, ఆ దైన్యాన్ని చూసిన అనుభవం, దానికి కారణాలు తెలిసిన అనుభవం ఆయనను మరో భగీరథుడిగా మార్చాయి. చుట్టూ పారే గోదావరి, కష్ణలను తెలంగాణ గడ్డ మీదికి తెచ్చుకోలేకపోతే తెలంగాణకు అర్థమే లేదనేది ఆయన సంకల్పం. తెలంగాణ సకల దరిద్రాలకు ఒకే విరుగుడు.. అది నీళ్లు! ఓ పదేండ్లు ఆ నీటిని అందించగలిగితే తెలంగాణ దేశాన్ని ఏలుతుంది.. శాసిస్తుంది. బహుశా జేపీలాంటి వారి బాధా అదేనేమో!
మీకైతే అట్ల.. మాకైతే ఇట్లనా?
ఆ మధ్య జేపీ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. తాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఏదో టూర్‌కు వెళ్తుంటే ఓ రైతు ఒంటిపై ఆచ్చాదన లేకుండా చెమటలు కక్కుతూ బావిలోంచి నీటిని తోడి మొక్కలకు పోస్తుంటే వెళ్లి విషయం అడిగితే ‘వాన లేదు.. మొక్కలను బతికించుకొనేందుకు తాపత్రయం’ అన్నాడట. ఆయన కష్టం చూసి జేపీ చలించి పోయారట. ఆ వెంటనే కార్యాలయంలో అధికారులను పిలిచి ఈ జిల్లాలో ఉన్న ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేయకపోతే మన బతుకులు వ్యర్థం. ఇక్కడ గుండ్లకమ్మ, మానేరు, ఓగేరు వాగులున్నాయి.. సాగర్ ఆయకట్టు చివరి కాలువలకు వాటిని మళ్లించాలని చెప్పి నిబంధనలు సరిపోకపోయినా గ్రామీణ క్రాంతి పథం నిధులతో ఆ పని చేపట్టారట.. నీళ్లు ఇచ్చారట. అవును.. మీ ప్రాంతంలో ఒక రైతు చెమటలు కక్కితే చూపిన జాలి.. తెలంగాణలో ఉరితాళ్లకు వేలాడిన రైతుల మీద లేదా? చిన్నచిన్న వాగులే వ్యర్థంగా పోతున్నాయని సాగుకు నిబంధనలు పక్కనపెట్టి మళ్లించిన మీకు, ఇక్కడ వేల టీఎంసీల గోదావరి వృథాగా పోయినా సరే… మళ్లించడం అసంబద్ధంగా కనిపిస్తున్నదా? జమా ఖర్చుల లెక్కలు గుర్తొస్తున్నాయా? జేపీ గారు..అంతగా మీరు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయి అనుకుంటే మీ రాష్ర్టానికి పోయి ఉండొచ్చు మీరు.
కుతర్క వాదన…
కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్తు ఖర్చు తడిసి మోపెడవుతుంది.. ఇది జేపీ వాదన. వెంట్రుక పీకితే మొదలు చివరా తెలియని చాలా మంది సొల్లుగాల్లదీ ఇదే వాదన. వాదనలు వాస్తవాలు, తర్కం ఆధారంగా జరగాలి అంటారు జేపీ. విషయం ఏమిటంటే ఆయన వాదనలో అటు వాస్తవాల అవగాహన.. ఇటు సరైన తర్కమూ రెండూ లేవు. కాళేశ్వరం రెండు దశల్లో మోటర్లు నడిస్తే 6,100 మెగావాట్ల విద్యుత్తు ఖర్చవుతుంది.. ఎకరాకు రూ.25 వేల ఖర్చు పడుతుందనేది ఆయన వాదన. ఇంతకన్నా రైతులు రెండుమూడు వందల అడుగుల్లో బోర్లు వేసుకుంటే, 5 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే కరెంటు ఖర్చు బాగా తగ్గిపోతుందట. మరి 45 లక్షల ఎకరాలకు సరిపోయే భూగర్భజలాలు తెలంగాణలో ఉన్నాయా? ఇక్కడ బోర్ల సక్సెస్ రేటు ఎంత? రెండుమూడు వందల అడుగుల్లో నీళ్లు పడే పరిస్థితి ఎన్ని జిల్లాల్లో ఉంది? శ్రీరాంసాగర్ ఏటా తన ఆయకట్టు లక్ష్యం చేరుతున్నదా? తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితుల మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? జేపీ వాదనలో తర్కం లేదు. క్షేత్రస్థాయి అవగాహనా లేదు.
ఆయన చెప్పిన విధంగా ఏటా కాళేశ్వరం రెండు దశల్లోని అన్ని మోటర్లు 200 రోజులపాటు విరామం లేకుండా నడుస్తాయా? 45 లక్షల ఎకరాల భూములకన్నింటికీ ఒక్క మేడిగడ్డ నుంచే నీరు ఎత్తిపోసి 22 లిప్టుల ద్వారా పంట పొలాలకు అందిస్తారా? అంటే తెలంగాణలో వర్షాలే పడవు.. చెరువులు లేవు.. ప్రాజెక్టులు లేవు.. వాటి నీటిని వాడుకోనే వాడుకోరా? ఆ మధ్య ధర్మపురి పర్యటనలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. పైన మంచి వరద ఉంటే కింద పంపులు ఆన్ చేయనే చేయమని. కానీ పరిస్థితి ఏమిటి? మహారాష్ట్రలో జైక్వాడీ అనే ప్రాజెక్టు ఉన్నది. దాని కెపాసిటీ 102 టీఎంసీలు. కానీ అది 40 టీఎంసీలకు మించటం లేదు. ఎందుకంటే నాసికా త్రయంబకం నుంచి వరద లేదు. మనకు ఈసారి ఆలస్యంగా అయినా వరద వచ్చింది కాబట్టి శ్రీరాంసాగర్‌కు సరిపోయింది. లేకపోతే కాళేశ్వరమే కదా దిక్కు? సమైక్యపాలకుల కాలంలో నిజాంసాగర్‌ను నాశనం చేశారు. దాన్ని బోధన్, బాన్స్వాడ అనే రెండు నియోజకవర్గాలకే పరిమితం చేశారు. సింగూరు నీటిని హైదరాబాద్ అవసరాలకు మళ్లించారు. గుత్ప, అలీసాగర్లను పట్టించుకోక సర్వనాశనం చేశారు. ఇవాళ కాళేశ్వరంతో వాటన్నింటితోపాటు నిర్మల్ జిల్లాలోని ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలకు కూడా నీరు అందిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్నా జేపీకి కాళేశ్వరం నచ్చలే! ఎందుకంటే మనిషి మాత్రమే ఇక్కడున్నాడు. మనసు తెలంగాణలో లేదు. అది కులంలోనో, పార్టీలోనో, ఇంకెక్కడో చిక్కుకుంది.