TGSRTC | హైదరాబాద్ : ఈ నెల 19వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతులకు, మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. రక్షాబంధన్ సందర్బంగా రాఖీలు, స్వీట్లు బట్వాడ కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. బుక్ చేసిన కౌంటర్ నుంచి 24 గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లను, 9 వేలకుపైగా పార్శిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల సామర్ధ్యంతో కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రక్షాబంధన్ సందర్భంగా స్వయంగా వెళ్లి రాఖీలు కట్టలేని యువతులు తమ లాజిస్టిక్స్ వినియోగించుకుని రాఖీలను, స్వీట్లను తమ అన్నదమ్ముళ్లకు పంపించుకోవచ్చని ప్రకటించింది.
కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు రాఖీలను, స్వీట్లను పంపించుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఎంపిక చేయబడిన బస్స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. యువతులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాల కోసం https//www.tgrtclogistics.co.in వెబ్సైట్ సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు కీలక వాదనలు
KTR | గురుకుల పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి.. కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సూచన
TG DSC | టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల
Venu Swamy | వేణుస్వామికి షాక్.. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు..!