TGSRTC | హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఈ నెల 5న చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి ఏడాది దాటిందని గుర్తుచేశారు.
కానీ కాంగ్రెస్ సర్కారు ఇంతవరకు అపాయింటేడ్ తేదీ ప్రకటించకపోవడంలోని అంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందర ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా అమల్లో నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ నెల 5న చేపట్టనున్న చల్ బస్‌భవన్ కార్యక్రమానికి కార్మికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రైతు పండుగ పేరుతో రైతులకు మరోసారి మోసం.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం