MRPS | దండోరా అనే వేగుచుక్క మాదిగ వాడల్లో అగ్గి పుట్టించింది : ఎమ్మార్పీఎస్ నేతలు
MRPS | ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఉపకులాల నాయకుల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని బచ్చన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు, కన్నీటి నివాళులు అర్పించారు.
MRPS | బచ్చన్నపేట, మార్చి 01 : బచ్చన్నపేట మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవరణంలో ఎమ్మార్పీఎస్, ఎస్సీ ఉపకులాల నాయకుల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమ ఘట్టాలలో వీరోచితమైన పాత్రను పోషించిదన్నారు. జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు, కన్నీటి నివాళులు అర్పించారు.
త్యాగాలు లేకుండా ఏ పోరాటం గమ్యాన్ని ముద్దాడలేదని అన్నారు. పోరాటాలు లేకుండా విజయం ఏనాడు దరి చేరలేదని జాతి మీద చీకట్లు కమ్ముకున్నప్పుడు దండోరా అనే ఒక వేగుచుక్క మాదిగ వాడల్లో అగ్గి పుట్టించిందన్నారు. అది తరతరాల జాతిని చీకటి పారదోలుతూ జాతికి వెలుగులు తీసుకొచ్చిందన్నారు. ఈ వెలుగులు సాధించడం కోసం నడిచిన పోరుబాటలో అనేకమంది బిడ్డలు అసువులు బాసారని అన్నారు.
నాడు వారి అమరత్వం సాక్షిగా వర్గీకరణను సాధిస్తామని అన్నారు. నేడు ఆ ప్రమాణం సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించి అమరుల ఆశయాలను నెరవేర్చామన్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు మాదిగ సమాజం పొందుతున్న వేళ మాదిగ అమరులను మది నిండా తలచుకొని ఘనమైన నివాళులు అర్పిద్దామని అని వారి త్యాగాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పుదామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పైస రాజశేఖర మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్వాల రాజు మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు పాకాల కుమార స్వామిమాదిగ, మండల సీనియర్ నాయకుడు బొడ్డు నవీన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అల్వాల విజయ్ కుమార్ మాదిగ, టౌను ప్రధాన కార్యదర్శి, గంధ మల్ల నాగరాజు, కొల్లూరు సంపత్, చెల్లపురం శ్రీకాంత్ మాదిగ, కొమ్ము శ్రీకాంత్ మాదిగ, అల్వాల మహేష్ మాదిగ, కర్రె శ్రీనివాస్ మాదిగ, గంధమల్ల మల్లేష్ మాదిగ, వీహెచ్పీఎస్ మండల నాయకుడు ఆల్వాల స్వామి మాదిగ, బేడ బుడగల జంగాల హక్కుల సమితి మండల అధ్యక్షుడు సిరిపాటి రామదాసు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

