TGPSC | హైదరాబాద్ : కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్లు లేవని టీజీపీఎస్సీ చెప్పకనే చెప్పింది. మే 1వ తేదీ నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. మార్చి 31వ తేదీలోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలపై కసరత్తు చేసి మే 1 నుంచి నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొంది. నోటిఫికేషన్లు జారీ అయ్యాక 6 నుంచి 8 నెలల లోపు ఉద్యోగాల భర్తీ చేపడుతామని స్పష్టం చేసింది.
ఇక గ్రూప్ -3కి సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసింది టీజీపీఎస్సీ. జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇక గ్రూప్ -2 ప్రాథమిక కీ కూడా మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పని చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ
KTR | ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్ వెళ్లొచ్చు.. కానీ
Harish Rao | కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు.. ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసు : హరీశ్‌రావు