TG TET 2024 | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ విడుదల కాలేదు. షెడ్యూల్ ప్రకారం గురువారం(డిసెంబర్ 26) టెట్ హాల్ టికెట్స్ విడుదల చేయాలి. ఇప్పటికే ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల అయింది. జనవరి 2వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అంటే ఎగ్జామ్స్‌కు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కాబట్టి వారం రోజుల ముందే హాల్ టికెట్స్ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో టెట్ హాల్ టికెట్స్ కోసం అభ్యర్థులు గురువారం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. రాత్రి 7:30 దాటినా కూడా హాల్ టికెట్స్ విడుదల చేయకపోవడంతో విద్యాశాఖపై టెట్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టెట్ అభ్యర్థుల్లో ఎందుకు ఆగ్రహం వ్యక్తం అవుతుందంటే.. గత అనుభావాలు, పరిణామాలు దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులపై మండిపడుతున్నారు. తాము ఆప్షన్ ఇచ్చిన ప్రకారం కాకుండా ఎక్కడో పరీక్షా కేంద్రాలు కేటాయించడమే. స్వస్థలాలను పరిగణనలోకి తీసుకోకుండా.. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. వారం రోజుల ముందే తమ పరీక్ష కేంద్రం ఏదో తెలిస్తే.. తగు జాగ్రత్తలు తీసుకుంటామని, మానసికంగా సిద్ధమై పరీక్షలకు ప్రిపేరవుతామని వాపోతున్నారు. తమ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో సెంటర్లు కేటాయిస్తే.. అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి.. వీలైనంత త్వరగా హాల్ టికెట్లు విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. కిమ్స్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీశ్‌రావు