RSP | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌లో గురుకుల పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. గురుకులాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీబీ నగర్ డిగ్రీ కాలేజీలో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
ఒక నాడు దేశంలో నే మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలగా కీర్తించబడ్డ బీబీ నగర్ డిగ్రీ కళాశాల రేవంత్ రెడ్డి ప్రజా(ప్రతీకార) ప్రభుత్వంలో నేడు శిథిలమైపోయింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎంతో మంది మెరికల్లాంటి తెలంగాణ అమ్మాయిలు ఈ కాలేజికి వచ్చి శిక్షణలో రాటుదేలి CDS, AFCAT, SSB లాంటి పరీక్షలకు చివరి స్టేజ్ వరకు వెళ్లేవారు. వీళ్లు మేజర్ ఉషా శర్మ, రాఖీ చౌహాన్ లాంటీ ఉక్కులాంటి ఆఫీసర్ల కనుసన్నల్లో పెరిగారు. ఇప్పుడు ఇదే తెలంగాణ పేద బిడ్డలను రేవంత్ రెడ్డి మళ్లీ చీకట్లోకి నెట్టేశారు అని ఆర్ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయమన్నాడన్న ఏకైక సాకుతో ఉన్న పళంగా మా పేద బిడ్డలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరో చోటికి రాత్రికి రాత్రే తరలించారు. అక్కడ పనిచేసే మిలిటరీ సిబ్బందికి గత ఐదు నెలల నుండి జీతాలు లేవట. భారత సైన్యం బహుమతిగా ఇచ్చిన యుద్ద ట్యాంకులు తుప్పు పడుతున్నాయి. ఇంత నాశనం చేసి మళ్లీ సిగ్గు లేకుండా విజయోత్సవాలు చేసుకున్నారు తెలంగాణ కాంగీయులు! ఛీ ఛీ.. అని ఆర్ఎస్పీ మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ పాలనలో ఈ కాలేజీ ఎలా ఉండేదో కొన్ని వీడియోలు పెట్టాను చూడండి. రిజర్వేషన్లో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/ మంత్రులు అయిన మిత్రులారా, మీ చేతకానితనాన్ని ఎలా వర్ణించాలో మాటలు రావడం లేదు. దీనికీ మళ్లీ తెలంగాణ సీఎంవో నుంచి ఏమైనా స్క్రిప్ట్ రావాల్నా భయ్యాలు??? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఒక నాడు దేశంలో నే మొదటి సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల గా కీర్తించబడ్డ బీబీ నగర్ డిగ్రీ కళాశాల @revanth_anumula గారి ప్రజా(ప్రతీకార) ప్రభుత్వం లో నేడు శిధిలమైపోయింది.
ఎంతో మంది మెరికల్లాంటి తెలంగాణ అమ్మాయిలు ఈ కాలేజికి వచ్చి శిక్షణలో రాటుదేలి CDS, AFCAT, SSB లాంటి పరీక్షలకు… pic.twitter.com/uyJEF7l0wE
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 26, 2024
ఇవి కూడా చదవండి..
Errolla Srinivas | నాపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వంపై ధర్మం గెలిచింది : ఎర్రోళ్ల శ్రీనివాస్
Harish Rao | శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. కిమ్స్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీశ్‌రావు
MLC Kavitha | బీసీలంటే లెక్క లేదా..? బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్