MLC Kavitha | బీసీలంటే లెక్క లేదా..? బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
MLC Kavitha | బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ పార్టీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | హైదరాబాద్ : బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ పార్టీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీకి లెక్కలేదా అని అడిగారు.
గురువారం నాడు కుమ్మరి సంఘం నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన నివాసంలో కలిశారు. బీసీలు, ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాలా మద్ధతిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నా… బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు అవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదని సూచించారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందని, కానీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే బీసీలపై ప్రేమ లేనట్లే మనం అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్ల శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర శాలివాన సంఘ నాయకులు దుగుంట్ల నరేష్, నిమ్మలూరి శ్రీనివాస్, రేపాక రాంబాబు, రావులకోల్ ఎన్, తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక సంఘం నాయకులు హకీంకారి సురేందర్, జికే జహంగీర్, జీకే పరమేశ్వర్, ఏ వెంకటేశ్వర్, జికే అఖిల బాయి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rains | తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు..!
Errolla Srinivas | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BC Census
- BC Leaders
- BJP
- BRS party
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

