మలయాళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్.. ‘చాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ప్రస్తుతం భాషలకు అతీతంగా సినిమాలు చేస్తూ ఈ మలయాళభామ చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్కి టాలీవుడ్లో మరో అద్భుతమైన అవకాశం వరించినట్టు ఇన్సైడ్ టాక్. చిరంజీవి కథానాయకుడిగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా సాగే పవర్ఫుల్ కథతో తెరకెక్కనున్న ఈచిత్రంలో చిరంజీవి కూతురు పాత్రకు చాలామంది యంగ్ క్రేజీ కథానాయికలను అనుకున్నారు. అయితే.. ఆ అవకాశం చివరకు అనస్వర రాజన్ని వరించిందని తెలిసింది. కూతురు పాత్రకు ఈ కథలో అత్యంత ప్రాధాన్యత ఉండటంతో ఈ బరువైన పాత్రకు అనస్వరరాజన్ అయితేనే న్యాయం చేకూర్చగలదని దర్శకుడు బాబీ భావించారట. త్వరలోనే టీమ్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.