Rakesh Reddy | హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్షపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పందించారు. హైకోర్టు నిర్ణయంతో నిరాశ చెందొద్దని గ్రూప్-1 అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. జీవో 29పై దాఖలైన పిటిషన్ను కొట్టేయడం చాలా దురదృష్టకరం అని చెప్పారు. జీవో 29కు వ్యతిరేకంగా గ్రూప్-1 అభ్యర్థులు కొట్లాడడం సమర్థనీయమని అన్నారు. సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు పాటుపడాలి.. అది ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం సాధించడానికి అదొక్కటే ప్రధాన సాధనం అని చెప్పారు. హైకోర్టు నిర్ణయంతో ఇది ఇక్కడే ఆగిపోతోందని నేను అనుకోను. గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మీ కోసం పోరాడుతూనే ఉంటామని ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థుల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
MLC Kavitha | బీసీలంటే లెక్క లేదా..? బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్