సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.1డిగ్రీలు, గాలిలో తేమ 33శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.