Hyderabad | హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్, నార్కోటిక్ బ్యూరో (TG NAB) అధికారులు సంయుక్తంగా 25 పబ్బులపై దాడులు చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకూ ఆయా పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పబ్బుల్లోని వారికి 107 డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. జీ40, విస్కీ సాంబ పబ్బుల్లో ఇద్దరు చొప్పున, జోరా పబ్బు, క్లబ్రోగ్లో ఒక్కొక్కరికి చొప్పున మొత్తం ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు పాజిటివ్ తేలిన వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
Also Read..
Rash Driving | బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఆటో, ఐదు కార్లు ధ్వంసం
Helicopter | వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ హెలికాప్టర్.. వీడియో
HYDRAA | గగన్‌పహాడ్‌లో హైడ్రా.. అప్ప చెరువులో నిర్మాణాల కూల్చివేత