HYDRAA | గగన్‌పహాడ్‌లో హైడ్రా.. అప్ప చెరువులో నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్ప చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్ప చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం రాంనగర్ మణెమ్మ గల్లీలో నాలా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసిన విషయం తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలను పరిశీలించిన 24 గంటలోపే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికా సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు రంగనాథ్ ఆదేశించడంతో హు టాహుటిన మణెమ్మ గల్లీని సందర్శించి వివరాలు సేకరించారు. అటు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు నాలా, రోడ్డును ఆక్రమించినట్లు నివేదిక ఇవ్వడంతో శుక్రవారం కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ, గ్యాస్ కట్టర్లు, ఆక్రమణలను నేలమట్టం చేశారు.
సర్వే నం. 20, 21 వార్డ్ 155 బ్లాక్ జమిస్తాన్‌పూర్‌లో కొందరు వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించి కల్లు కాంపౌండ్, మరొకరు నాలాను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేట్టడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణల నేపథ్యం విక్రమ్, సాయి యాదవ్‌లకు చెందిన 50 గజాల స్థలంలో ఉన్న ఒక గది, ఎల్లయ్య పేరుతో ఉన్న మూడు అంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ హఫీజ్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Appa Lake
- FTL
- Gaganpahad
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

