Helicopter | కేదార్నాథ్ (Kedarnath)లో ఓ హెలికాప్టర్ (Helicopter) కూలిపోయింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ (MI 17 Chopper) నుంచి ఒక్కసారిగా జారి కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కేదార్నాథ్ సందర్శన సమయంలో యాత్రికులను తరలించేందుకు వినియోగించే ఓ క్రెస్టల్ హెలికాప్టర్ ఇటీవలే ల్యాండింగ్ సమయంలో దెబ్బతింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం దాన్ని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 చాపర్‌ను వినియోగించారు. ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను ఛాపర్‌కు కట్టి తరలించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఎంఐ-17కి అమర్చిన తీగలు తెగిపోయాయి. దీంతో వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ మందాకిని నది (Mandakini River) సమీపంలో జారి పడింది. ఈ ఘటనలో హెలికాప్టర్ మొత్తం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని సంబంధిత అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
Dramatic video coming in :
A Kestrel Aviation aircraft which was being taken underslung from Kedarnath to Gauchar has been released midway near Bhimballi as it was said to be unstable.
Kestrel Aviation recently had a chopper incident in Kedarnath.
— Tarun Shukla (@shukla_tarun) August 31, 2024
Also Read..
Rash Driving | బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఆటో, ఐదు కార్లు ధ్వంసం
Heavy Rain | విజయవాడలో భారీ వాన.. కొండచరియలు విరిగిపడి వ్యక్తి మృతి