హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన ఫార్చునర్ కారు (Rash Driving) ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లింది. పార్కింగ్‌లో ఉన్న కారు, ఆటోను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారును మైనర్ బాలుడు నడుపుతున్నట్లు తెలుస్తున్నది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు.