విజయవాడ: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సున్నపుబట్టీల సెంటర్లో కొండ చరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి కరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో రెండు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. బస్టాండ్ సమీపంలో లోలెవల్ బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయాయి.
భారీ వర్షాల కారణంగా విశాఖ, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇక, రానున్న 24 గంట్లలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. శనివారం అర్ధరాత్రి కళింగపట్న వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
RED ALERT FOR COASTAL AP:
Massive Rains Lashing In Parts Of Eluru,Krishna,NTR(#Vijayawada), Ubhayagodavari,Konaseema,Guntur Districts.More Rains Possible In These Regions During Next 48Hours.Stay Safe.#AndhraPradesh #Andhrarains pic.twitter.com/YQd5VzXfcf— ANDHRA WEATHER (@Andhra_weather) August 31, 2024