ISL 2025-26 : ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్. ‘గోట్ ఇండియా టూర్ ఆఫ్ 2025’లో లియోనల్ మెస్సీ (Lionel Messi) రాకతో పులకించిపోయిన ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఇండియన్ సూపర్ లీగ్(ISL) 2025-26 సీజన్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ మెగా టోర్నీ సందడి షురూ కానుందని బుధవారం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) వెల్లడించింది. టైటిల్ కోసం 14 జట్లు పోటీపడుతాయని తెలిపిన ఏఐఎఫ్ఎఫ్ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది.
ఇండియన్ సూపర్ లీగ్ 2025-26 సీజన్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగనుంది. టోర్నీలో పాల్గొనే 14 జట్లను గ్రూప్‌లుగా విభజిస్తారు. లీగ్ దశలో ఒక జట్టు తమ గ్రూప్‌లోని టీమ్‌తో ఒక మ్యాచ్ ఆడనుంది. ఒక్కో గ్రూప్ నుంచి అత్యధిక పాయింట్లు సాధించిన జట్లు ముందంజ వేస్తాయి.
🚨 The roadmap ahead for the next few months in Indian football!#IndianFootball pic.twitter.com/wwqvaLjXwZ
— RevSportz Global (@RevSportzGlobal) January 6, 2026
అయితే.. ఈ మెగా ఈవెంట్ ఆరంభ తేదీని ప్రకటించిన ఏఐఎఫ్ఎఫ్.. బెంగళూరు, చెన్నాయిన్, ఢిల్లీ, ఈస్ట్ బెంగాల్, గోవా, ఇంటర్ కాశీ, జంషెడ్పూర్, కేరళ బ్లాస్టర్స్, మొహమ్మదిన్, మొహున్ బగన్, ముంబై సిటీ, నార్త్ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, పంజాబ్ క్లబ్స్‌ను సంప్రదించాక పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొంది.