T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ కోసం నేపాల్ క్రికెట్ తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఉపఖండంలో జరుగునున్న పొట్టి ప్రపంచకప్ కోసం పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు నేపాల్ సెలెక్టర్లు. రోహిత్ పౌడెల్(Rohit Paudel) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. అంతర్జాతీయంగా, ఫ్రాంచైజీ క్రికెట్లో రాణిస్తున్న సందీప్ లమిచానే ప్రధాన స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్నాడు. పేస్ విభాగానికి సొంపల్ కమి, కరన్ కేసీ నేతృత్వం వహించనున్నారు.
గత ఎడిషన్‌లో నాలుగుకు నాలుగు మ్యాచుల్లో ఓడిన నేపాల్ ఈసారి గెలుపై ధీమాతో ఉంది. ఇటీవల టీ20ల్లో సంచలన విజయాలు సాధిస్తున్న ఈ ఆసియా జట్టు ఆల్‌రౌండర్ సందీప్ పౌడెల్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత్, శ్రీలంకలోప్రభావం చూపే అవకాశం ఉన్నందున నలుగురు స్పిన్నర్లను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. సందీప్ లమిచానేతో కలిసి తిప్పేసేందుకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు లలిత్ రాజ్భన్షి, దీపేంద్ర ఐరీ, బసిర్ అహ్మద్‌లు రెఢీగా ఉన్నారు.
Nepal Squad for ICC Men’s T20 World Cup 2026.#lka #Nepal #T20WorldCup pic.twitter.com/sM8lABXtqx
— Thimira Nawod (@ImThimira07) January 6, 2026
నేపాల్ టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్ : రోహిత్ పౌడెల్(కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, అసిఫ్ షేక్(వికెట్ కీపర్), సందీప్ జొరా, ఆరిఫ్ షేక్, బసిర్ అహ్మద్, సొంపాల్ కమి, కరన్ కేసీ, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షీ, షేర్ మల్లా, లోకెశ్ బమ్.
ఫిబ్రవరి 7వ తేదీన భారత్, శ్రీలంక వేదికగా పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. గ్రూప్ సీలో ఉన్న నేపాల్ లీగ్ దశలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, వెస్టిండీస్‌తో తలపడనుంది. మెగా టోర్నీ తొలిమ్యాచ్‌లో ఫిబ్రవరి 8న పౌడెల్ సేన మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ఇటీవల వెస్టిండీస్‌కు షాకిస్తూ పొట్టి సిరీస్ గెలుపొందిన నేపాల్ జట్టు ఈసారి ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు సవాల్ విసిరినా విసరవచ్చు.