తిరుమల : మారిషస్ అధ్యక్షుడు ( Mauritius President ) ధరంబీర్ గోకూల్ ( Dharambeer Gokhool ) తన సతీమణితో కలిసి మంగళవారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. డిప్యూటీ ఈవో రిసెప్షన్ భాస్కర్, ఓఎస్డి సత్రే నాయక్ ,ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రపంచ మూడవ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు మారిషస్ ప్రధాని గుంటూరులో పాల్గొన్నారు.