TPTU Dairy : తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPTU) నూతన డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిలు ఆవిష్కరించారు. TPTU అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, వ్యవస్థాపకులతో కలిసి బుధవారం వీరు డైరీని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో TPTU రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్, వ్యవస్థాపకులు వేణుగోపాల స్వామి, జక్టో మాజీ అధ్యక్షులు జి. భుజంగరావు, జి. మాధవరెడ్డి, సోమ్లా నాయక్, వేణు బాబు, తదితరులు పాల్గొన్నారు.