TG CET | ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ స్టేట్ – స్టేట్‌లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) సర్టిఫికెట్ల జారీని అధికారులు గురువారం ప్రారంభించారు. గతేడాది మేలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలను నవంబర్ 16న విడుదల చేశారు.
ధృవపత్రాల పరిశీలన పూర్తైన అనంతరం సర్టిఫికెట్ల జారీని మొదలుపెట్టారు. ఓయూ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, సెట్ మెంబర్ సెక్రెటరీ, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్‌కుమార్ నాయక్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను జారీ చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సెట్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌తో వచ్చి తీసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అవినీతి, అరాచక కాంగ్రెస్‌ను గద్దె దింపేదాక పోరాటం సాగిద్దాం : కేటీఆర్
SSA Strike | వినూత్నంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సమ్మె..
Rythu Bharosa | రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తులు..! జనవరి 14 నుంచి అమలు..!!