హైదరాబాద్ : తెలంగాణలో చలి పంజా(Cold wave) విసురుతోంది. చలికి జనం గజగజ వణికిపోతున్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. చలికితోడు పొగమంచి కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్ర భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్(Orange alert) ప్రకటించారు. ఆదిలాబాద్ 6.7 డిగ్రీలు,పటాన్ చెరులో 9.6,డిగ్రీలు, రామగుండంలో10.6 డిగ్రీలు, మెదక్‌లో11.3 డిగ్రీలు, వరంగల్‌లో11.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా చలి విపరీతంగా పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలుచోట్ల సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఇండియన్ మెటలార్జికల్ డిపార్ట్మెంట్(IMD) తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం వేళల్లో పొగమంచు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..