MLA KP Vivekananda | స్పీకర్ నుంచి ఏమైనా ఆదేశాలున్నాయో మాకు చెప్పాలే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
MLA KP Vivekananda | మా శాసన సభ ప్రజలతో ఎన్నుకోబడి అధికారికంగా అసెంబ్లీలో అడుగుపెట్టేటటువంటి సర్వాధికారాలుండి పోలీసులతో ఇబ్బంది పడుతున్నమంటే రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన సాగుతుంది.. ఎలాంటి అరాచక పాలన సాగుతుందో క్లియర్‌గా కండ్లకు కట్టినట్టుగా కనిపించిందన్నారు.
MLA KP Vivekananda | బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కూడా బ్లాక్ టీషర్టులతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాస్వామిక పద్దతిలో పొందుపరుచుకుని.. లోపలికి వెళ్లేటప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలు జరిగిన దాష్టీకాలు, దాడులను చూస్తుంటే ఈ దాడి ముఖ్యమంత్రి ప్రణాళిక ప్రకారమే చేయించారని చాలా స్పష్టంగా అర్థమవుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులంతా కూడా ఆదేశించి మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి చేయించినట్టు స్పష్టంగా.. కండ్లకు కట్టినట్టు కనబడుతోందన్నారు.
ఈ రోజు ఎప్పుడు కూడా శాసనసభ చరిత్రలో ఇన్ని సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మెయిన్ గేట్ దగ్గర ఎప్పుడున్నా సరే పార్కింగ్ దగ్గర కార్లు ఆపిన తర్వాత అక్కడున్నటువంటి పోలీసులు చెక్ చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే లోపలికి పంపించి చీఫ్ మార్షల్ మాట్లాడిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటే స్పీకర్ మాట్లాడిన తర్వాతనే ఏదైనా చర్య ఉంటది తప్ప గేటు దగ్గర ఆపేసి దాడి చేసే విధంగా.. లోపలికే పోనీయం అనే విధంగా.. అంటే మా శాసన సభ ప్రజలతో ఎన్నుకోబడి అధికారికంగా అసెంబ్లీలో అడుగుపెట్టేటటువంటి సర్వాధికారాలుండి పోలీసులతో ఇబ్బంది పడుతున్నమంటే రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన సాగుతుంది.. ఎలాంటి అరాచక పాలన సాగుతుందో క్లియర్‌గా కండ్లకు కట్టినట్టుగా కనిపించిందన్నారు కేపీ వివేకానంద.
చీఫ్ మార్షల్ వచ్చి మాట్లాడాలి..
ఎందుకు ప్రణాళిక ప్రకారం జరుగుతుందని చెప్తున్నమంటే.. అక్కడ ఎప్పుడు కూడా మామూలు పోలీసింగ్ ఉంటది.. ఏవైనా ఉద్యోగ సంఘాలో, ప్రజా సంఘాలో పెద్ద ఎత్తున పిలుపునిస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టుకుంటరు.. కానీ ఈ రోజు పోలీసులకే కాకుండా.. టాస్క్‌ఫోర్స్, స్పెషల్ టీంలే కాకుండా గ్రే హౌండ్స్ దళాలు కూడా వచ్చి పడ్డయి అక్కడ..అసలు ఒక శాసనసభ్యుడిని కూడా చూడకుండా తోసేయడం,తొక్కేయడం, తన్నేయడం, గుద్దేయడం.. ఒక చీఫ్ మార్షల్ వచ్చి మాట్లాడాలి.. స్పీకర్ నుంచి ఏమైనా ఆదేశాలున్నాయో మాకు చెప్పాలే.. ఇన్ని రోజుల్లో మమ్మల్ని ఎప్పుడు అడ్డుకోలేదు.. ఎన్నో సందర్భాల్లో ప్లకార్డులు తీసుకొని పోయం. పోయినంక మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరుంటే ఇది అభ్యంతరకరమని చెప్పి పలాన వ్యక్తి స్పీకర్ కార్యాలయంలో చెప్తే అప్పుడు దాన్ని పక్కనేస్తరన్నారు. అంతేకానీ ఈ రకమైన దాడి చేయరని కేపీ వివేకానంద మండిపడ్డారు.
LIVE: తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుhttps://t.co/lyygnByd7C
— BRS Party (@BRSparty) September 7, 2026
Read Also :
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

