ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) రామవరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ తుకారాం రాథోడ్, డీపీఎంఓ మోహన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు.
రుద్రంపూర్, సెప్టెంబర్ 07 : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) రామవరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ తుకారాం రాథోడ్, డీపీఎంఓ మోహన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆకుకూరలు, సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, సులభంగా జీర్ణమయ్యే మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
వైట్ రైస్, తీపి పదార్థాలు, కూల్డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్, ఫాస్ట్ఫుడ్ వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలన్నారు. షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధుల నియంత్రణకు వయసుకు తగిన వ్యాయామం, యోగా, రోజువారీ నడక ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతిరోజూ 7–8 గంటల నిద్ర అవసరమని పేర్కొన్నారు. ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, అవయవ దానం గొప్ప మానవతా దానమని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

