హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చాలనే డిమాండ్‌తో ఈ నెల 26న రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని అంబేదర్ చౌరస్తాలో ‘ముదిరాజ్ సింహగర్జన’ సభను ఆ సంఘం నాయకులు నిర్వహించతలపెట్టారు. తెలంగాణభవన్‌లో సోమవారం బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు కలిసి సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింహగర్జన పోస్టర్‌ను కేటీఆర్ ఆవిషరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనపై కేటీఆర్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రెండు నెలలుగా వీరోచితం గా పోరాడుతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జీవో 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థు లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పోరాటాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ఎదిరించగలమని మరోసారి చాటిచెప్పిన యువకిశోరాలకు తెలంగాణ జేజేలు’ అంటూ కేటీఆర్ పేరొన్నారు.