Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ రీ-ఎంట్రీకి రెడీనా .. ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిమ్‌లోకి, అసలు కారణం ఇదే!
Rakul Preet Singh | సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వారు.. ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించకుండా పోతుంటారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుండటంతో పలువురు సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయి.
Rakul Preet Singh | సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వారు.. ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించకుండా పోతుంటారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుండటంతో పలువురు సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతున్నాయి. కొందరు పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలో స్థిరపడుతుండగా.. మరికొందరు బిజినెస్, ఇతర రంగాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్ ప్రారంభించారు.
జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. రకుల్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నారా? అనే చర్చ మొదలైంది.రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో హీరోయిన్గా సినీ ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తో మంచి విజయాన్ని అందుకుని ఒక్కసారిగా టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారారు. అనంతరం పలువురు స్టార్ హీరోల సరసన నటించి వరుస అవకాశాలను సొంతం చేసుకున్నారు.
తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకున్న రకుల్.. టాలీవుడ్లో అగ్ర కథానాయికల జాబితాలో చోటు సంపాదించారు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం హిందీ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.తాను ప్రేమించిన బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.అయితే కొంతకాలంగా ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో అభిమానులు రకుల్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో తీవ్రమైన నడుము నొప్పి కారణంగా ఆమె కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీంతో వర్కౌట్స్‌కు కూడా దూరంగా ఉన్నారు.తాజాగా దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత మళ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రారంభించారు. నడుముకు బెల్ట్ ధరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను రకుల్ షేర్ చేశారు. వైద్యుల సలహా మేరకు సేఫ్టీ గేర్‌తో మళ్లీ వర్కౌట్స్ మొదలుపెట్టినట్లు ఆమె వెల్లడించినట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

