Chittem Arrest | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ జాతీయ రహదారిపై ధర్నా.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం అరెస్ట్
Chittem Arrest | కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
మక్తల్ : అసెంబ్లీ సమావేశాల కార్యక్రమానికి నల్ల టీషర్లు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ( BRS MLAs) అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మక్తల్ జాతీయ రహదారి ( National Highway ) పై బీఆర్ఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామ్ లాల్ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి నర్వ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావుతోపాటు మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకొని మహిళలపై చేయి చేసుకోవడం చట్ట విరుద్ధమని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీ ల పేరుతో రాష్ట్ర ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినప్పటికీ ప్రజలకు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుకొని తోసి వేయడం వల్ల మహిళలకు గాయం కావడంతో పాటు, కేటీఆర్ మోచేతికి, కనతపై గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జాతీయ రహదారిపై గంటపాటు గందరగోళమైన పరిస్థితి చోటు చేసుకుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

