శనివారం 04 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 19:33:33

తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కే. తారక రామారావు శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు.తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్పకళ గురించి వర్ణిస్తూ  రాసిన గీతం మసస్సును హత్తుకుందని మంత్రి ప్రశంసించారు.

ఈ పాటకు  వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా సినీ నేపథ్య గాయకులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్‌లు ఆలపించారు.  ప్రియదర్శి తన తల్లిదండ్రులు, భార్యతో మంత్రిని కలిసారు. పాటను ఆవిష్కరించిన  మంత్రి కేటీఆర్‌కు ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపారు. 


logo