ఇష్టమైతేనే బడికి రండి

- 9వ తరగతి నుంచి పీజీ వరకు ఆఫ్‌లైన్
- డిజిటల్ మాధ్యమంలోనూ పాఠాల బోధన
- హాజరు లేకున్నా పరీక్షలు రాసే అవకాశం
- ఒక బెంచీలో ఒక్కరే కూర్చునేలా ఏర్పాట్లు
- అన్ని విద్యాసంస్థల్లో ఐసొలేషన్ గదులు
- స్కూలుకు వచ్చేవారికి మధ్యాహ్న భోజనం
- పునఃప్రారంభానికి ప్రభుత్వ మార్గదర్శకాలు
- 8వ తరగతి వరకు ఆన్లైన్ పాఠాలే
- 300 కన్నా ఎక్కువ విద్యార్థులున్న జూనియర్ కాలేజీల్లో 2 షిప్టులు
- పరీక్షలకు సిలబస్70%
- అసైన్మెంట్లు, ప్రాజెక్టులు30%
- 50% డిగ్రీ, వృత్తి విద్యకాలేజీల్లో రొటేషన్ పద్ధతిలో క్లాసులు
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు ఇష్టమైతేనే బడికి రావొచ్చు.. హాజరులేకపోయినా పరీక్షలు రాయొచ్చు. బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలి. ప్రతి విద్యాసంస్థ కచ్చితంగా రెండు ఐసొలేషన్ గదులను అందుబాటులో ఉంచుకోవాలి. ఇవీ విద్యాసంస్థల పునఃప్రారంభానికి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు. వచ్చే నెల 1నుంచి బడులు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యాచరణను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రత్యక్ష తరగతులు ఉండవని పేర్కొన్నారు. 9 10, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అన్ని సాంకేతిక విద్యాసంస్థలకు మాత్రమే తరగతులు జరుగుతాయని తెలిపారు. విద్యాసంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పాటించి తరగతులు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్నభోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యవేక్షణకు డీఎల్ఈఎంసీ
ప్రభుత్వ మార్గదర్శకాల అమలు పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీ(డీఎల్ఈఎంసీ)ని ఏర్పాటు చేస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో డీఈవో, ఐటీడీఏ పీవో, డీఎంహెచ్‌వో, డీపీవో,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, కలెక్టర్ నామినేట్ చేసిన ఒకరు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 18లోగా యాక్షన్‌ప్లాన్‌ను జిల్లాల్లోని సంబంధిత శాఖాధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వ వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
పాఠశాలలకు..
- 9 ఆపై తరగతులకు బోధించే ఉపాధ్యాయులంతా విధులకు హాజరుకావాల్సిందే.
- తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక సమ్మతి పత్రాలు తెచ్చిన వారినే తరగతులకు అనుమతిస్తారు.
- తరగతులకు హాజరు కాలేని వారికి డిజిటల్ విధానంలో పాఠాలు అందుబాటులో ఉంచుతారు.
- 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు ఉండవు.. డిటెన్షన్ విధానం ఉండదు
- దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఎట్టిపరిస్థితుల్లో తరగతులకు అనుమతించరు.
- 70 శాతం సిలబస్‌నే బోధిస్తారు. మిగతా 30శాతం సిలబస్‌ను ప్రాజెక్ట్, వర్క్స్, అసైన్మెంట్లుగా ఇస్తారు.
- ఎస్సెస్సీ పరీక్షలు ఎప్పుడు ముగిస్తే అప్పుడే చివరి పనిదినంగా పరిగణించాలి.
- కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, డీఈఐఈడీ కాలేజీలు సైతం ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభమవుతాయి.
జూనియర్ కళాశాలలకు
- విద్యార్థులకు వైద్యసాయం కోసం వైద్యసంస్థలతో సమన్వయం చేసుకోవాలి.
- 300 కంటే తక్కువ విద్యార్థులున్న కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు తరగతులు నిర్వహించాలి.
- 300 కన్నా ఎక్కువ విద్యార్థులున్న కాలేజీలు రెండు షిప్టుల్లో (8.30 నుంచి 12.30వరకు, 1.30 నుంచి 5.30 వరకు) తరగతులు నిర్వహించాలి.
- ఇంటర్‌బోర్డు సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యాసంవత్సరం ఉంటుందని పేర్కొన్నందున ఆన్లైన్క్లాసుల ద్వారా చాలా వరకు సిలబస్ పూర్తయింది. మిగతా సిలబస్‌ను రెగ్యులర్ తరగతుల్లో పూర్తి చేయాలి. దీంతోపాటు మార్చి31 వరకు సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలి.
- స్మార్ట్ఫోన్లు లేదా నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులు కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్‌లను వాడుకోవచ్చు.
- వార్షిక పరీక్షలు 70 శాతం సిలబస్‌తోనే నిర్వహిస్తారు. మిగతా 30 శాతం సిలబస్‌ను వివిధ అసైన్మెంట్లు, ప్రాజెక్టుల ద్వారా చేపడ్తారు.
- వార్షిక పరీక్షల్లో ప్రశ్నాపత్రాన్ని సరళంగా రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తారు.
- ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు.
డిగ్రీ, ఒకేషనల్ కాలేజీలకు
- ఆన్లైన్ క్లాసులు, దూర విద్య తరగతులు యథాతథంగా కొనసాగించాలి. బోధన, బోధనేతర సిబ్బంది 50 % మేరకే కళాశాలకు హాజరుకావాలి.
- తరగతి గదుల్లో 50% మంది విద్యార్థులను భౌతికదూరం పాటిస్తూ, రొటేషన్ పద్ధతిలో అనుమతించాలి.
- కళాశాలల ప్రిన్సిపాళ్లు శానిటేషన్, మెడికల్, లాజిస్టిక్, అకడమిక్ ప్రణాళికలు రూపొందించుకోవాలి.
- డిగ్రీ, వృత్తి విద్యకళాశాలలకు కాలేజియేట్ సాంకేతిక విద్య కమిషనర్ సవరించిన విద్యా క్యాలెండర్‌ను విడుదల చేస్తారు.
శానిటైజేషన్ ప్లాన్
- ఈ నెల 20లోగా పాఠశాలలు, కళాశాలల శానిటైజేషన్ పూరి ్తచేయాలి.
- టాయిలెట్లు, తాగునీటి ట్యాంకులను, విద్యాసంస్థ ఆవరణ శుభ్రంగా ఉండేలా జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షించాలి.
- తరగతిగదులతోపాటు ఫర్నిచర్, ఎక్విప్మెంట్, స్టేషనరీ, స్టోరేజ్, కిచెన్, క్యాంటీన్, ల్యాబొరేటరీస్, లైబ్రరీలతో పాటు ఇతర ప్రదేశాలన్నింటినీ శానిటైజేషన్ చేయాలి. గదులన్నింటిలోకి గాలి వీచేలా ఏర్పాట్లు చేయాలి. సదుపాయాల కల్పనకువిద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపాల్స్ తీసుకోవాలి.
- డిస్ఇన్ఫెక్షన్ సామగ్రి, సబ్బులను సమకూర్చాలి. డిజిటల్ థర్మామీటర్‌ను వాడేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
- స్కూళ్లు, కాలేజీలు తమ కార్యకలాపాలకు ముందే పూర్తిగా శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. విద్యార్థుల తరలించే ట్రాన్స్పోర్ట్ వాహనాలన్నింటినీ క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి.
వైద్య ప్రణాళిక
- కొవిడ్ ఎమర్జెన్సీ దృష్ట్యా విద్యాసంస్థల్లో కనీసం రెండు ఐసోలేషన్ గదులను అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకు అవసరమయ్యే వస్తుసామగ్రిని డీఎంఅండ్‌హెచ్‌వోలు సరఫరా చేయాలి. వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.
- కావాల్సినన్ని శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
- కరోనా అనుమానితులుంటే వారిని తక్షణమే ఐసొలేషన్ చేయాలి. అనుమానితులకు సేవలందించేందుకు గాను ప్రిన్సిపాళ్లు, సంబంధిత జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వోను సంప్రదించి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలి.
- విద్యాసంస్థల్లోకి ప్రవేశించేటప్పుడు, బయటికెళ్లేటప్పుడు భౌతికదూరం పాటించాలి. బయటివ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాంగణంలోకి అడుగుపెట్టనీయవద్దు.
- ఏ విద్యాసంస్థల్లో ఎవరు వైద్య సేవలందించనున్నారో పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను రూపొందించాలి.
తాజావార్తలు
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు