న్యూఢిల్లీ: భారత్-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్ వీసా సేవలను పునఃప్రారంభించింది.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ ఈ వీసాల జారీ ప్రక్రియను జూలైలో ప్రారంభించింది.