న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. దీంతో ఆరుబయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపేయాలని పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ క్యాటగిరీకి చేరడంతో, సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ ఆదేశాలిచ్చింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, రికగ్నయిజ్డ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.