కొడినర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విధుల మానసిక ఒత్తిడితో గుజరాత్లో ఓ బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం అతడు గిర్ సోమ్నాథ్ జిల్లా దెవ్లి గ్రామంలోని తన ఇంట్లో ఉరేసుకొన్నాడు.
‘ఇక ‘సర్’ పని చేయడం నాకు అసాధ్యం. మన కొడుకును జాగ్రత్తగా చూసుకో ’ అని భార్యను ఉద్దేశించి ఆయన సూసైడ్ నోట్ రాశారు.