Mohammed Siraj | హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్ భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ మొహమ్మద్ సిరాజ్‌ను సీఎం అభినందించారు. టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన అనంతరం హైదరాబాద్‌కు చేరిన సిరాజ్ మంగళవారం ఉదయం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిరాజ్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాధించాడని సీఎం ప్రశంసించారు.
భారత ప్లేయర్‌గా ఏడేండ్లుగా సేవలు అందిస్తుండటమేకాక, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలుపు బృందంలో సిరాజ్ ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరాజ్‌ను సన్మానించింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తెలంగాణకు నిధులు తేవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం : హరీశ్ రావు
TG Rains | ఉపరితల ద్రోణి ప్రభావం.. మరో మూడురోజులు వానలే..!