TG Rains | ఉపరితల ద్రోణి ప్రభావం.. మరో మూడురోజులు వానలే..!
TG Rains | తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల గురువారం మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో వైపు రాగల మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
TG Rains | తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల గురువారం మోస్తరు వర్షాపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో వైపు రాగల మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు పడుతాయని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది.
ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని.. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

