హైదరాబాద్ : రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్ల వేతనం రూ. 10,500 నుంచి రూ. 13,650కి.. మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ. 6 వేల నుంచి 7800కు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ. 6 వేల నుంచి 7800కు పెంచింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు కానున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.