CM Revanth Reddy | అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి.అర్ శర్మ ,జనరల్ సెక్రెటరీ ఆనంద్ శర్మలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అర్చక ఉద్యోగుల సమస్యలు విన్నవించారు.
CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి.అర్ శర్మ ,జనరల్ సెక్రెటరీ ఆనంద్ శర్మలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అర్చక ఉద్యోగుల సమస్యలు విన్నవించారు.
ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు కాబట్టి అర్చకుల బదిలీలు చేయకూడదని ముఖ్యమంత్రి సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ శేషాద్రికి ఆదేశాలు ఇచ్చారు. దేవాదాయ శాఖలో 5 సంవత్సరాలకు పైగా పని చేస్తున్న అర్చక ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఒకే శాఖ ఒకే వేతన విధానంలో భాగంగా అర్చక ఉద్యోగులకు ఈఏఎఫ్ ద్వారా వేతనాలు అందించడం, అర్చకులకు, సిబ్బందికి పదవీ విరమణ సమయంలో ప్రస్తుతం రూ. 2 లక్షలు మాత్రమే దేవాదాయ శాఖ చెల్లిస్తుంది. కనీస పెన్షన్ అమలు చేయాలని, దేవాదాయ శాఖ సంబంధించిన భూముల రక్షణకు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
దేవాలయ సిబ్బందికి ఈవోల ప్రమోషన్స్ త్వరితగతిన చేపట్టాలని కోరారు. అర్చక ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డులు అందచేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సందర్భంగా డీవీఆర్ శర్మ, ఆనంద్ శర్మలు సీఎం రేవంత్ రెడ్డికి దైవ ప్రసాదాన్ని, శేషవస్త్రాలు అందచేసి ఆశీర్వదించి, ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఐదుజిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
Telangana | ఆర్థిక శాఖలో పని విభజన.. స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పని భారం తగ్గింపు..!
Group-2 | నిరుద్యోగులకు తలవంచిన రేవంత్ సర్కార్.. గ్రూప్-2 డిసెంబర్‌కు వాయిదా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

