TG Rains | వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఐదుజిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
TG Rains | ఒడిశా, ఉత్తరాంధ తీరాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
TG Rains | ఒడిశా, ఉత్తరాంధ తీరాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల, ఏపీలోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. శనివారం తెల్లవారు జామున వాయువ్యదిశగా పయణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి 24గంటల్లో క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. ఈ క్రమంలో రాగల రెండురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్… ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

